telugu navyamedia
health news Telangana trending

హైదరాబాద్‌ : …19న .. రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియో…

pulse polio on 19th in telangana

ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని ఐదేండ్లలోపు వయసున్న వారందరికీ కలిపి మొత్తం 38 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 23,231 పల్స్‌పోలియో కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. దవాఖానల్లు, బస్టాండ్లు, మెట్రోస్టేషన్లు, రైల్వేస్టేషన్లలో కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు.

బస్తీలు, ఇటుక బట్టీల్లాంటి ప్రాంతాలకు వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు దాదాపు 830 సంచార బృందాలను ఏర్పాటుచేయనున్నట్టు ఇమ్యునైజేషన్‌ ఇంచార్జ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. 19న పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు 20, 21 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వేస్తారని, ఇందుకు 46,432 బృందాలను రంగంలోకి దింపుతామని ఆయన వెల్లడించారు.

Related posts

వికారాబాద్ : … మంత్రి సబితారెడ్డి సుడిగాలి పర్యటన .. పలు అభివృద్ధి పనుల ప్రారంభం..

vimala p

మార్కెట్‌ కమిటీ ఛైర్మన్ లలో .. సగం మహిళలకే .. ఏపీసీఎం జగన్ ..

vimala p

వైరస్ వ్యాప్తికి షట్ డౌన్ ఒక్కటే మార్గం: బిల్ గేట్స్

vimala p