telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నటిని కావాలనుకోలేదంటున్న .. పూజా హెగ్డే

puja hegdhe bold photo shoot

వరుసగా పెద్ద సినిమాల ఆఫర్లతో పూజా హెగ్డే చాలా బిజీగానే ఉంది. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత నుండి వాల్మీకి వరకూ అన్నీ క్రేజీ సినిమాలే. ఇప్పుడు సెట్స్ పై ఓ భారీ సినిమా ఉంది. బాహుబలి ప్రభాస్ తో కలసి నటించిన సినిమా ఇది. అలాగే బన్నీ సినిమా కూడా. అయితే ఇంత స్టార్ అవుతానని ఎప్పడూ అనుకోలేదట పూజా.

నటిని కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. పెద్దయ్యాక ఏం కావాలన్న ఆలోచన కూడా నాకు ఉండేది కాదు. నా స్నేహతులు, మా అన్నయ్య మాత్రం మేం ఇది అవుతాం, అలా చేస్తామని చెప్పేవాళ్లు. ఆ విషయంలో చాలా గందరగోళంగా అనిపించేది. ఇక సినిమా ఆలోచనలైతే అస్సలు వచ్చేవి కావు. కానీ అనుకోకుండా మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. ఆ రంగం నుంచి సినిమా కోసం కెమెరా ముందుకొచ్చా. ఆ విషయం తలచుకొని ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటానని చెప్పుకొచ్చింది పూజా.

Related posts