telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కిరణ్‌ బేడీ పై పుదుచ్చేరి సీఎం సంచలన వ్యాఖ్యలు…

కిరణ్‌ బేడీపై సీఎం నారాయణస్వామి.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్ గా‌ కిరణ్‌ బేడీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవి నుంచి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. కిరణ్‌ బేడీపై ఫైర్ అయ్యారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి .. గత నాలుగేళ్లుగా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి కారణంగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. పాలనాపరమైన విషయాల్లో తలదూరుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రోజుకో కొత్త సమస్య సృష్టిస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్‌ బేడీని పదవి నుంచి తొలగించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆమెపై చర్యలు తీసుకునేందుకు మేం చేసిన ప్రయత్నాలు ఫలించాయని వ్యాఖ్యానించారు. ఇక, పుదుచ్చేరిలో ప్రజలు సెక్యులర్‌ పార్టీలనే కోరుకుంటున్నారని స్పష్టం చేసిన సీఎం నారాయణస్వామి.. మతపరమైన అంశాలకు ఇక్కడ చోటులేదని పేర్కొన్నారు. కాగా, కిరణ్‌ బేడీని పదవి నుంచి తొలగించిన రాష్ట్రపతి కోవింద్.. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ గీషయం పై కిరణ్‌ బేడీ ఎలా స్పందిస్తారు అనేది.

Related posts