telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

పబ్‌జి ప్రేమికులకు .. మరో శుభవార్త.. ఇక లైట్ తో ఎక్కడైనా..

pubg lite will be ready for game lovers

పబ్‌జి మొబైల్ గేమ్ ప్రియులకు శుభవార్త. తక్కువ స్థాయి కాన్ఫిగరేషన్ ఉన్న పీసీల కోసం టెన్సెంట్ గేమ్స్ పబ్‌జి లైట్ గేమ్‌ను లాంచ్ చేస్తుందని గతంలో వార్తలు వచ్చిన విషయం విదితమే. అందులో భాగంగానే ఆ సంస్థ తాజాగా పబ్‌జి లైట్ గేమ్‌కు గాను బీటా వెర్షన్‌ను లో ఎండ్ పీసీల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో గేమర్లు https://lite.pubg.com/download/ లింక్‌ను సందర్శించి పబ్‌జి లైట్ బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా పబ్‌జి లైట్ బీటా వెర్షన్ ఫైల్ సైజ్ 64 ఎంబీ ఉంటుంది. కానీ దాన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేశాక మళ్లీ 2.4 జీబీ వరకు గేమ్ ఫైల్స్ డౌన్‌లోడ్ అవుతాయి. దీంతోపాటు యూజర్లు పలు ఇతర సాఫ్ట్‌వేర్లను కూడా పీసీలో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ విజువల్ సీ++, డాట్‌నెట్ ఫ్రేమ్ వర్క్ 4.5.2, డైరెక్ట్ ఎక్స్ 11 తదితర సాఫ్ట్‌వేర్లను యూజర్లు తమ పీసీల్లో ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే.. పబ్‌జి లైట్ బీటా వెర్షన్‌ను ఆడుకోవచ్చు. కాగా ఈ కొత్త గేమ్ భారత్‌తోపాటు ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకలలోని గేమర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక భారత్‌లోని యూజర్ల కోసం ఇంగ్లిష్‌తోపాటు మరో లాంగ్వేజ్ ఆప్షన్‌గా హిందీని ఈ గేమ్‌లో అందివ్వనున్నారు. కాగా ఈ గేమ్ కోసం ప్రీ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి గేమ్‌లో పలు రివార్డులను అందజేయనున్నారు. ఈ నెల 11వ తేదీ తరువాత యూజర్లు గేమ్‌లోని మెయిల్ బాక్స్‌ను ఓపెన్ చేయడం ద్వారా ఆ రివార్డులను పొందవచ్చు. పబ్‌జి లైట్ బీటా గేమ్ ఆడేందుకు పీసీలకు ఉండాల్సిన కనీస రిక్వయిర్‌మెంట్ల విషయానికి వస్తే, విండోస్ 7, 8 లేదా 10 ఆపరేటింగ్ సిస్టమ్ (64 బిట్) * ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ (2.4 గిగాహెడ్జ్ స్పీడ్), 4జీబీ ర్యామ్ * ఇంటెల్ హెచ్‌డీ 4000 గ్రాఫిక్స్, 4జీబీ హార్డ్ డిస్క్ స్పేస్.

Related posts