telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

పబ్ జీ .. ఇక పరిమితం..! క్షమాపణలు చెపుతున్న సంస్థ.. !!

10 arrested for playing online pubg game

పబ్ జీ ఆటగాళ్లు ఆనారోగ్యం బారిన పడుతూ ఉండటం, ఈ గేమ్ ను నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతుండటంతో నష్టనివారణ ప్రయత్నాలను పబ్ జీ మొబైల్ ఇండియా ప్రారంభించింది. ఈ గేమ్ ఆట ఆడే సమయాన్ని పరిమితం చేసింది. పరిమిత సమయం ముగిసిన తరువాత కూడా యూజర్లు గేమ్ ను ఆడుతుంటే, ఆటోమేటిక్ గా గేమ్ ఆగిపోతుంది. “మీరు దాదాపు ఆరు గంటల నుంచి గేమ్ ను ఆడుతున్నారు. తిరిగి రేపు ఉదయం 5.30 గంటల తరువాత ఆడండి” అన్న మెసేజ్ ని స్క్రీన్ పై చూపుతూ, తన గేమ్ ను షట్ డౌన్ చేశారని చెబుతూ, ఓ యూజర్ మొబైల్ స్క్రీన్ షాట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

కొంతమంది తాము గంటసేపు ఆడగానే ఇదే తరహా మెసేజ్ లు వస్తున్నాయని వెల్లడించారు. ఇదే విషయమై పబ్ జీ మొబైల్ ఇండియా స్పందిస్తూ, “మీలో చాలామందికి ‘హెల్దీ గేమింగ్ సిస్టమ్’ సమస్య వచ్చిందని తెలిసింది. ఇందుకు మేము మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు మా డెవలప్ మెంట్ టీమ్ కృషి చేస్తోంది” అని ట్విట్టర్ లో ప్రకటించింది.

Related posts