telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

పబ్ జీ ని .. మించిన మరో వీడియో గేమ్.. శాంతి సందేశమట..

pub-g replaced with peace game

అత్యంత ఆదరణ ఉన్న వీడియో గేమ్ ఏదంటే వచ్చే సమాధానం ఒక్కటే. అదే ‘పబ్ జీ’. కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చుకుంటూ వెళ్లే ఈ గేమ్ కు ఎంతో మంది బానిసలై, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎంతో హింసాత్మకంగా ఉన్న ఈ గేమ్ ను పలు దేశాలు బ్యాన్ చేశాయి కూడా. అదేతరహాలో మరో గేమ్ విడుదలై అంతే క్రేజ్ ను తెచ్చుకుంటోంది. దానిపేరు ‘గేమ్ ఫర్ పీస్’. పబ్ జీని తయారు చేసిన టెన్సెంట్ సంస్థే దీన్ని కూడా తయారు చేసింది.

ఈ గేమ్ ను బయటకు వదిలిన మూడు రోజుల్లో దాదాపు వంద కోట్లకు పైగా డౌన్ లోడ్స్ వచ్చాయంటే, గేమ్ ఎలా ఆసక్తికరంగా ఉందో తెలుసుకోవచ్చు. వాస్తవానికి పబ్ జీని చైనా బ్యాన్ చేసిన తరువాత, టెన్సెంట్ కు భారీ నష్టం వాటిల్లగా, దాన్ని పూడ్చుకునేందుకు ఈ కొత్త గేమ్ ను ఆ సంస్థ తయారు చేసింది. ఇప్పుడీ గేమ్ టెన్సెంట్ కు కాసుల పంట పండిస్తోంది. అయితే, 16 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే గేమ్ డౌన్ లోడ్ అవుతుంది. 18 ఏళ్ల లోపుంటే రోజులో రెండు గంటలు మాత్రమే ఆడుకునే సౌలభ్యం ఉంటుంది. పేరుకు తగ్గట్టేే శాంతి సందేశం వ్యాప్తి చేసేలా ఆట ఉంటుంది.

Related posts