telugu navyamedia
వార్తలు సామాజిక

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!

rains in telugu states today

రేపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, శనివారం సాయంత్రానికి తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు దాదాపు 6 రోజుల ముందుగానే అండమాన్, నికోబార్ దీవులకు చేరుతాయని వాతావరణ శాఖ చెప్పింది.

సాధారణంగా మే 20 తరువాత రుతుపవనాలు అండమాన్ ను తాకుతాయి. ఆపై మరో 10 నుంచి 11 రోజుల్లో కేరళకు చేరుతాయి.ఇక కేరళకు నైరుతీ రుతుపవనాలు ఎప్పుడు చేరుకుంటాయన్న విషయమై కచ్చితమైన తేదీలను ఓ వారం రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి.

Related posts