telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పీఎస్‌పీకే 27 టైటిల్ వచ్చేది అప్పుడే…?

Pspk27

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసుకున్న పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తన తాజా సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాకి ఇంకా నామకరణం జరగలేదు. పవన్ ఈ సినిమాతో పాటుగా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్‌ను కూడా రూపొందిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది. ఈ సినిమాకు ఇప్పటికే విరూపాక్ష, హరహర వీరమల్లు, ఓం శివమ్ అంటూ అనేక పేర్లు ప్రచారం అయ్యాయి. కానీ ఈ సినిమా పేరు విషయంలో అధికారిక ప్రకటన ఒక్కటి కూడా రాలేదు. అయితే మూవీ మేకర్స్ ఎట్టకేలకు సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు అని తెలుస్తుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి11 విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా 17వ శతాబ్ద నేపథ్యంలో తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఈ సినిమా పవన్ కెరీర్‌లో చేస్తున్న మొట్టమొదటి పిరియాడికల్ సినిమా. ఇందులో పవన్ ఓ దొంగ పాత్రలో కనిపించనున్నట్లు ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది.

Related posts