telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

శబరిమలలో .. మహిళల దర్శనంతో.. ఉద్రిక్తత.. బందులోను..

protest diverted in kerala on sabarimala issue

శబరిమలలో అధికారులు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు మహిళలకు స్వామి దర్శనాన్ని చేయించిన విషయం తెలిసిందే. దీనిపై భక్తులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి ఘటన జరగటంతో ఆలయం ప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. అయితే ఈ ఘటనతో శబరిమల రక్షణ సమితి కేరళలో బంద్ ప్రకటించింది. ఈ బంద్ ఉద్రిక్తంగా మారింది. తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు దాదాపు 60 బస్సులను ధ్వంసం చేశారు. పందలంలోని సీపీఎం కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పలుచోట్ల భారీగా పోలీసులు మోహరించారు.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న (బుధవారం) తెల్లవారుజామున బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు పోలీసుల సాయంతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించారు. విషయం తెలిసిన ఆలయ ప్రధాన అర్చకుడు ఆలయ ద్వారాలు మూసివేశారు. గంట పాటు ఆలయాన్ని శుద్ది చేసి అనంతరం తిరిగి ఆలయాన్ని తెరిచి భక్తులకు అనుమతించారు.

Related posts