రాజకీయ వార్తలు

తిరుపతిలో ధర్నా…దర్యాప్తుతో సరి…

మే 11న భారతీయజనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు, తిరిగి వెళ్లేప్పుడు టీడీపీ వర్గాలు అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనంలో టీడీపీ వర్గాలను ఖైదు చేశారు, ఈ ఖైదుకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతిలో ధర్నాకు దిగారు. దీనితో పోలీసులు టీడీపీ వర్గాల వారిని విడుదల చేశారు. అయితే ఈ ఘటనను నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు మాట ఇవ్వటంతో ఆమె ధర్నా విరమించారు.

టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన బీజేపీ నేత కోలా ఆనంద్ అతని అనుచరులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను ఆమె ప్రశ్నించారు. శాంతి యుతంగా, ధర్మంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు అనుకోని విధంగా కార్లు దూసుకురావడం, ఆ కార్లు దూసుకు వచ్చిన విధానం కార్యకర్తలను భయ భ్రాంతులకు గురి చేసినందుకు చెల్లా చెదురుగా పరుగులు తీశారు. ఆపిన కారులోనుంచి దిగివచ్చి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ బీజేపీ నేతలను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ఘాటుగా ప్రశ్నించారు. 

Related posts

పసిఫిక్ మహాసముద్రంలో విమాన విన్యాసాలు

admin

లోకం తీరు మారాలంటున్న జేడీ

admin

హరికృష్ణ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులు..

madhu

Leave a Comment