telugu navyamedia
crime Telangana

మసాజ్‌ సెంటర్‌ పై పోలీసుల దాడి..

Prostitution Scandal In Masaj Centre

హైదరాబాద్ నగరంలో మసాజ్‌ సెంటర్‌ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. స్థానిక హిమాయత్‌నగర్‌ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్, నారాయణగూడ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి, నిర్వాహకుడు పజ్జూరి వెంకటేష్‌ పాటు ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం విఠల్‌వాడీ ఎక్స్‌రోడ్డులో రాజశేకర్‌ అనే వ్యక్తి ‘ థ్యాంక్యూ రిఫ్రెష్‌బ్యూటీ అండ్‌ హెల్త్‌ కేర్‌’ పేరుతో బ్యూటీపార్లర్, మసాజ్‌ నిర్వహిస్తున్నాడు. ఇందులో క్రాస్‌ మసాజ్‌తో పాటు, వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Related posts

త్వరలో రాష్ట్రమంతట ఆరోగ్య సూచిక: హరీష్‌రావు

vimala p

చట్టాల సవరణపై కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదు: డీకే అరుణ

vimala p

తెలంగాణలో మరో ఎన్నికల షెడ్యూల్ విడుదల!

vimala p