telugu navyamedia
andhra news political trending

ఏపీలో .. హెడ్ కానిస్టేబుళ్ల పదోన్నతులకు సై…

promotions to head constables in ap

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రభుత్వం ఉద్యోగులనైనా తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో పడింది. ఆయా ఉద్యోగులకు పదోన్నతులు అంటూ తాయిలాలు ప్రకటిసుంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. కొత్తగా కేబినెట్ లో చేరిన కిడారి శ్రవణ్, ఫరూక్ పేషీ లో 16 పోస్టులు మంజూరుకు పచ్చజండా ఊపారు.

ఈ సమావేశంలోనే హెడ్ కానిస్టేబుళ్ల పదోన్నతులకు ఆమోదం తెలిపింది కేబినెట్. దీనితో పాటుగా 566 ఏ.ఎస్.ఐ పోస్టులను కూడా మంజూరుచేయాలని నిర్ణయించారు. అలాగే ఆదరణ2 కార్యక్రమం క్రింద ఇచ్చే సబ్సిడీని 70 నుండి 90 శాతానికి పెంచారు. దీని వలన ప్రభుత్వం పై 195కోట్లు భారం పడుతున్నప్పటికీ, 8 లక్షల మందికి లబ్ది చేకూరుతుండటంతో కేబినెట్ ఆమోదం తెలిపింది.

Related posts

చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు

vimala p

వరుస బాంబు పేలుళ్లతో.. దద్దరిల్లిన సోమాలియా.. 25 మృతి..

vimala p

ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ .. జూలై 1కి వాయిదా..

vimala p