telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

విద్యార్థులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త !

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 313 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇద్దరు కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 142 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. అయితే…కరోనా కేసులు పెరుగుతుండగా.. ప్రత్యక్ష బోధన కొనసాగుతున్న పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాల్లోనూ కరోనా బారీన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1-5 తరగతి వరకు చదివే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం..ఈ నిర్ణయం తీసుకుంది. 6, 7, 8 తరగతులు ప్రత్యక్ష బోధనను నిలిపివేసే అవకాశాలు కూడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 9వ తరగతి విషయంలోనూ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 10వ తరగతి విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్‌ అయినందున ప్రత్యక్ష బోధన కొనసాగించే అవకాశం ఉంది. వీటిపై ఈనెల 22న స్వయంగా సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేస్తారని సమాచారం.

Related posts