telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ మెడలు వంచడం పెద్ద పనేం కాదు: కోదండరాం

kodandaram protest on inter students suicide

ఆంధ్రా పాలకులను తరిమికొట్టిన మనకు కేసీఆర్ మెడలు వంచడం పెద్ద పనేం కాదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కేసీఆర్ తప్ప ఎవరూ కారణం కాదన్నారు. కార్మికుల సమ్మె విజయవంతమయ్యేందుకు తెలంగాణ సమాజం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. కేసీఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం మొత్తం ఏకమవుతోందన్నారు.

ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ పదేపదే చెబుతున్న సీఎం కేసీఆర్ ఈ సంవత్సరం ప్రభుత్వాదాయం ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని సీఎంపై మండిపడ్డారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఉద్యోగులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు.

Related posts