telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

40కే పెట్రోల్.. ప్లాస్టిక్ తో తయారీ.. వాడేసుకుంటున్న పరిశ్రమలు.. తయారీ భారత్ లోనే..

professor producing petrol from plastic waste

పెట్రో సంబంధ వాహనాఇంధనం కొనడానికే బయపడి కొందరు తమ వాహనాలను బయటకు తేవడానికి భయపడుతున్నారు. అంత భారీగా ఇంధనరెట్లు పెరిగిపోయాయి. దీనితో నీటితోనో .. కరెంటుతోనో .. నడిచే వాహనాలను కూడా రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల కరెంటు వాహనాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇక పెట్రో సంబంధిత ఇంధనం వలన వాతావరణ కాలుష్యం కూడా భారీగానే జరుగుతుందని మరో సమస్య కూడా లేకపోలేదు. ఇన్ని సమస్యల మధ్య మరోదారి కోసం ప్రయత్నిస్తుండటం కూడా సహజం. అలాగే ప్రయత్నించి విజయం సాధించాడు ఒక భారతీయుడు. ఆటగాడు ప్లాస్టిక్ వ్యర్దాల నుండి పెట్రో ఇంధనం తయారీ చేస్తున్నాడు. 500 కిలోల వ్యర్దాలతో దాదాపుగా 400 లీటర్ల ఇంధనం తయారుచేయవచ్చట. ప్రస్తుతం తన ప్లాంట్ లో 200 కేజీల వ్యర్దాలతో 200 లీటర్ల ఇంధనం తయారుచేస్తున్నాడు. దానిని చుట్టుపక్కల ఉన్న కర్మాగారాలకు విక్రయిస్తున్నారు. అదికూడా లీటర్ 40-50 రూపాయలకు మాత్రమే. ఈ తరహా ఉత్పత్తి చాలా సులభం అంటున్నాడు సదరు వ్యక్తి.

దీనిపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా తనవద్దకు వస్తే, టెక్నికల్ సమాచారం పంచుకోడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు చెపుతున్నాడు. చిన్న తరహా పరిశ్రమ పెట్టుకోవాలనుకునే వారికీ ఇది చాలా మంది ఆలోచన అని ఆయన అంటున్నాడు. ఈ పరిశ్రమకు నీళ్లు అవసరం లేదు, అలాగే ఈ పరిశ్రమ వలన ఎటువంటి గాలి, నీటి కాలుష్య సమస్య అసలుకే లేదట. ఇంతా చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రొఫెసర్ సతీష్ కుమార్. ఈయన హైదరాబాది.. ఒక మెకానికల్ ఇంజనీర్. ఇంకెందుకు ఆలస్యం, ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి, ప్లాస్టిక్ వ్యర్దాలకు మనదేశంలో కొదవే లేదు.. అనే ఈ పరిశ్రమ మూడుపువ్వులు ఆరు కాయలు అన్నమాటే..!!

Related posts