క్రైమ్ వార్తలు వార్తలు సినిమా వార్తలు

వివాదాల్లో రష్మీ ‘అంతకుమించి’… కేసు నమోదు

ప్రముఖ దర్శకుడు జానీ దర్శకత్వం వహించిన ‘అంతకు మించి’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే… కాగా ఈ సినిమాలో బుల్లి తెరపై హాట్ యాంకర్ గా గొప్ప పేరు తెచ్చుకున్న రష్మీ ఈ సినిమాలో కథానాయికగా నటించింది… కాగా  ఈ సినిమా ప్రస్తుతం వివాదాల్లో పడింది…  ఆ వివాదాలు ప్రేక్షకులు  చేసేవి కాదండోయ్ ఈ సినిమా నిర్మాత నే పోలీసులను సంప్రదించాడు… ఎందుకోసమో తెలుసా…?

‘అంతకు మించి’ సినిమాకు తేళ్ల భానుప్రకాష్ మరియు తిరుమనాధంలు సహ నిర్మాతలుగా వ్యవహరించగా గౌరీ కృష్ణ నిర్మాతగా ఉన్నారు… అయితే ఈ సినిమా విడుదల గురించి చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తనకు తెలియకుండానే విడుదల చేశారని శుక్రవారం రోజున బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు… గౌరీ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదులో సినిమా హీరో సతీష్ తనను మోసం చేశాడని అతనిపై కఠినమైన చర్యలు చేపట్టాలని పేర్కొనగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు… 

Related posts

'పద్మావతి' విడుదల తేదీ వచ్చేసింది..!

admin

జితన్ 'ఒకటే లైఫ్' మోషన్ పోస్టర్..

admin

మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. దొంగల్లా వచ్చి పోలీస్ స్టేషన్ పై దాడి… ఒకరు మృతి..

nagaraj chanti

Leave a Comment