telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్… “ఆర్ఆర్ఆర్” మరోసారి వాయిదా

RRR

కరోనా మహమ్మారి కారణంగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం మరోసారి వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన నిర్మాత డీవీవీ దానయ్య “ఆర్ఆర్ఆర్” విడుదల తేదీపై కీలక విషయాలు చెప్పారు. అనుకున్న టైమ్‌కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశం లేదని తేల్చేశారు. చెప్పినట్లుగానే వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన “ఆర్ఆర్ఆర్” మూవీని విడుదల చేయాలని అన్నివిధాలా ప్రయత్నించాం కానీ.. లాక్‌డౌన్ కారణంగా ప్లానింగ్ దెబ్బతిందని ఆయన తెలిపారు. చిత్రానికి సంబంధించి ఇంకా షూట్ చేయాల్సిన కొన్ని సన్నివేశాలున్నాయని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పిన దానయ్య, అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయడం కష్టమే అని చెప్పారు.ఈ సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రామ్ చరణ్ సీతారామరాజు లుక్ ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ఉంటుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

Related posts