telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అల్లరి నరేష్ తో సినిమా చేయాలనుకుంటున్న దిల్ రాజు…

టాలీవుడ్ కామెడీ హీరోగా అల్లరి నరేష్ మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ కొంతకాలంగా నరేష్ వరుస అపజయాలను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. అంతేందుకు ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన బంగారు బుల్లోడు కూడా ప్లాప్ అయింది. అయితే తన మళ్లీ ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలనుకున్న నరేష్ కొత్తగా పక్కా సీరియస్ పాత్రను ఎంచుకున్నారు. ఆ సినిమానే నాంది. నాంది సినిమాలో నరేష్ తన నట విశ్వరూపం చూపించారనడంలో అతిశయోక్తేమీ లేదు. ఈ సినిమా అందరి ఊహలను మించి అలరిచింది. ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా నాందీ టీమ్ అంతా మాట్లాడారు. ఇక తాజాగా నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్‌ లో నరేష్ కు మంచి ఆఫర్ వచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… తాను నరేష్ తో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నాను అని.. మంచి కథ దర్శకుడు దొరికితే వెంటనే నరేష్ తో సినిమా ప్రారంభిస్తాను అని పేర్కొన్నాడు. అయితే నరేష్ ఇంతకముందు తనకు హిట్ అందించిన విజయ్ దర్వకత్వంలోనే తన తర్వాతి సినిమా చేస్తాన’ని నరేష్ అన్నారు. చూడాలి మరి ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ప్రకటిస్తారు అనేది.

Related posts