telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఉత్తరప్రదేశ్ లో హస్తానికి.. హస్తం.. ప్రియాంక గాంధీ చొరవ..

Priyanka Gandhi started Ist road show

ప్రియాంక గాంధీ తూర్పు ఉత్తర ప్రదేశ్ కు నాయకురాలిగా నియమితులైన తరువాత తీసుకున్న తొలి నిర్ణయంగా మొత్తానికి వచ్చే ఎన్నికల కోసం స్నేహాన్ని కుదుర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ-బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ను పక్కనపెట్టేశాయి. దీనితో ఒంటరిగా మారిన హస్తం పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో స్థానిక పార్టీ అయిన మహాదళ్‌తో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. మహాదళ్ చీఫ్ కేశవ్ మౌర్యను సాదరంగా ఆహ్వానిస్తున్నామని, పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ఫైట్ చేస్తామని ప్రియాంక తెలిపారు.

మధ్య, పశ్చిమ యూపీలో ఓబీసీ ఓటర్ల మద్దతు కలిగిన మహాదళ్‌తో పొత్తు కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని భావిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం మహాదళ్ తమతో కలిసి ముందుకు సాగుతుందని పశ్చిమ యూపీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కాంగ్రెస్‌తో కలిసి తమ పార్టీ పనిచేస్తుందని, ఈ నెల 24న మొరాదాబాద్‌లో సింధియాతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు మౌర్య తెలిపారు.

Related posts