telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

సినిమాల్లోంచి బయటకు రండి… కేంద్ర మంత్రికి ప్రియాంక గాంధీ చురకలు

Priyanka

దేశంలో ఆర్థిక మందగమనం లేదని, ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన 3 సినిమాలు మొదటి రోజే రూ 120 కోట్ల వసూళ్లు సాధించడమే దీనికి నిదర్శనమని కేంద్ర మంత్రి ఆర్ ఎస్ ప్రసాద్ ​వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను బాలీవుడ్‌తో ముడిపెడుతూ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర మంత్రి ఆర్ఎస్ ప్రసాద్ సినిమా జీవితం నుంచి బయటకు రావాలని, వాస్తవ పరిస్థితుల నుంచి ఆయన తప్పించుకోలేరని చురకలంటించారు. ఈ మేరకు “సినిమాల ద్వారా వచ్చే లాభాలను పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. మంత్రి గారూ సినిమాల నుంచి బయటకు రండి..వాస్తవాన్ని అంగీకరించేందుకు సిగ్గు పడకండి” అని ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.

Related posts