telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

హాలీవుడ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా…

గ్లామర్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారు ఎవరు ఉండరు. 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటం సొంతం చేసుకున్న ఈ బ్యూటీ హాలీవుడ్ పాప్ సింగర్ నిక్కీ జోనస్‌ను వివాహం చేసుకొని విదేశాలకు షిఫ్ట్ అయిపోయింది. ఈ మధ్య  కాస్త స్పీడ్ తగ్గించిన పీసీ. కరోనా సమయంలో తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎంతో మందికి అభిమాన నటిగా, ఆరాధ్య దేవతగా మారిన ప్రియాంక, బాలీవుడ్‌లో సుస్థిరమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు హాలీవుడ్‌లోను నటిస్తున్న విషయం తెలిసిందే . తాజాగా హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్‌లో పీసీ నటిస్తున్నదని తెలుస్తుంది.  ప్రపంచంలో హిట్ సిరీస్ సినిమాల జాబితాలో మ్యాట్రిక్స్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే కొత్తగా తెరకెక్కుతున్న మ్యాట్రిక్స్-4లో  ప్రియాంకా చోప్రా నటించనున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దాన్ని నిజం చేస్తూ ఆ సినిమా షూటింగ్ కోసం జర్మనీ చేరుకున్న ఈ భామ తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే హాలీవుడ్ అవకాశాలు సంపాదించి, అక్కడ కూడా తన ప్రతిభను చూపిస్తుంది ఈ గ్లోబల్ బ్యూటీ . ప్రస్తుతం కీనూరీవ్‌తో కలిసి మ్యాట్రిక్స్-4 చేస్తోంది. ప్రియాంకా బెర్లెన్‌లో తన షూట్‌ను పూర్తి చేస్తోందని తెలుస్తుంది.

Related posts