telugu navyamedia
సినిమా వార్తలు

విజయాల వెనుక అవమానాలు… బయటపెట్టిన ప్రియాంక చోప్రా

Priyanka-Chopra

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ పాప్‌సింగర్ నిక్ జొనాస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి.. హాలీవుడ్‌లోనూ క్వాంటికో సిరీస్‌లో ప్రతిభ చాటి తనేంటో ప్రపంచానికి తెలియజేసింది. తనకంటే చాలా తక్కువ వయసున్న నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా తన భర్త నిక్‌తో ఎంజాయ్ చేసిన దృశ్యాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రియాంక చోప్రా కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో దర్శకులు తనపై కోపంతో కేకలు వేసేవారని షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా సినిమాల్లో తనను తీసుకొని మళ్లీ తొలగించారని వెల్లడించింది. తనపై దర్శకులు అరిచేవారని.. సినిమా కోసం తీసుకొని మళ్లీ తీసేసేవారని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన తండ్రి ఎంతో ధైర్యం చెప్పేవారని తెలిపింది. తనలో తనే ఆత్మస్థైర్యాన్ని నింపుకొని పరాజయం తరువాత ఏం చేస్తే, ఎలా చేస్తే విజయం సాధించొచ్చనే విషయాలను నేర్చుకున్నట్లు వెల్లడించింది. ఇండస్ట్రీలో ‘మేరీకోమ్’, ‘బాజీరావ్ మస్తానీ’ లాంటి ఎన్నో హిట్టు సినిమాలు చేసిన ఈ భామ ఆ విజయాల వెనుక ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘స్కై ఈజ్ పింక్’ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Related posts