telugu navyamedia
telugu cinema news

నిక్ ను ప్రియాంక బలవంతంగా పెళ్ళి చేసుకుందా ?

PRiyanka-Wedding

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ లు ఇటీవలే వివాహం చేసుకొని సంతోషంగా ఉన్నారు. అయితే వారి సంతోషంపై బురద జల్లుతోంది ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్. వివరాల్లోకి వెళ్తే… ప్రియాంకతో నిక్ కు జరిగింది బలవంతపు పెళ్ళి అంటూ న్యూయార్క్ నుంచి వెలువడే “ది కట్” అనే మ్యాగజైన్ ప్రచురించిన కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియాంకపై ఈ మ్యాగజైన్ జాతి వివక్షను చూపుతోందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిక్ కు ఈ పెళ్ళి ఇష్టం లేకుండానే జరిగింది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ బాలీవుడ్ బ్యూటీతో నిక్ కొంతకాలం ఎంజాయ్ చేయాలనుకున్నాడు. కానీ గ్లోబల్ స్కాం ఆర్టిస్ట్ ప్రియాంక అతన్ని ఏకంగా పెళ్ళి పీటల వరకు నడిపించి, ఆమెను నిక్ వివాహం చేసుకునేలా చేసింది అంటూ “ది కట్” మ్యాగజైన్ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనాన్ని రాసింది మ్యాగజైన్ విలేఖరి మారియా స్మిత అనే మహిళ కావడం గమనార్హం.

ఈ కథనంపై స్పందించిన ప్రియాంక ” ఇలాంటి పిచ్చి కథనాల్ని అస్సలు పట్టించుకోను నేను… ప్రస్తుతం నా వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వార్తలు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేవు” అంటూ మండిపడింది. ఇక నిక్ జోనస్ సోదరుడు ఈ కథనంపై స్పందిస్తూ “ఇది చాలా అసహ్యకరమైన కథనం… ఒక మహిళ గురించి ఇలాంటి కథనం ప్రచురించినందుకు ఆ పత్రిక సిగ్గుపడాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై బాలీవుడ్ వర్గాలు కూడా ఆగ్రహంగా ఉన్నాయి. “ఆడవాళ్ళ గురించి గొప్పగా రాసే ది కట్ మ్యాగజైన్ ప్రియాంకపై జాతి వివక్షతో రాసిన కథనానికి సిగ్గుపడాలి” అంటూ సోనమ్ కపూర్ వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో కూడా Shame on you @mRiah అనే హ్యాష్ ట్యాగ్ తో తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ కథనంపై తీవ్రంగా వ్యక్తిరేకత పెరుగుతుండడంతో ఆ మ్యాగజైన్ నిర్వాహకులు కథనాన్ని తొలగించి క్షమాపణ కోరారు.

Related posts

సర్వే రిపోర్టులు పంపిస్తానంటే..కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ ఇచ్చారు: లగడపాటి

ashok

“జిగర్తాండా” రీమేక్ లేదు : హరీష్ శంకర్

vimala p

గూగుల్ లో ప్రియా ప్రకాష్ వారియర్ కు మొదటి స్థానం

vimala p