telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో హీరోతో బెడ్ రూమ్ లో ప్రియాంక చోప్రా ఇలా…!?

Priyanka-Chopra

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ పాప్‌సింగర్ నిక్ జొనాస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి… హాలీవుడ్‌లోనూ క్వాంటికో సిరీస్‌లో ప్రతిభ చాటి తనేంటో ప్రపంచానికి తెలియజేసింది. ప్రియాంక చోప్రా దాదాపు మూడేళ్ళ‌ త‌ర్వాత హిందీలో “ది స్కై ఈజ్ పింక్” అనే చిత్రంలో న‌టించింది. అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటించారు. ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, ప్రియాంక చోప్రాలు 2005లో “దిల్ ద‌ఢ్‌ఖ‌నే దో” అనే చిత్రంతో తొలిసారి ప్రేక్ష‌కుల ముందుకు రాగా, “ది స్కైజ్ ఈజ్‌ పింక్” వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న‌ రెండో చిత్రం. ఇందులో ప్రియాంక 21 ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. సోనాలి బోస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న “ది స్కై ఈజ్‌ పింక్‌” చిత్రంలో జైరా వ‌సీమ్ కూడా ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుంది. ప్రియాంక త‌ల్లిగా జ‌రీనా న‌టిస్తుంది. ఇప్పుడు ది స్కై ఈజ్ పింక్ సినిమాలో మరోసారి హాట్ సీన్స్ చేస్తూ మతులు చెడగొట్టేసింది. ముఖ్యంగా ఫర్హాన్ అక్తర్‌తో బెడ్రూమ్ సీన్స్ చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

Related posts