telugu navyamedia
సినిమా వార్తలు

స్టార్ హీరోయిన్ ను చంపాలనుకున్న యువకుడు…!?

Priyanka Chopra gets slammed by a backup Dancer
గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పుడామె తన భర్త నిక్ జోనస్ తో కలిసి అమెరికాలో నివసిస్తోంది. అయితే ఇప్పుడు “ఎంటీవీ రోడీస్” కు చెందిన ఒక కంటెస్టెంట్ ప్రియాంకకు చంపాలనుందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 
ఇటీవల “రోడీస్” షో ఆడిషన్స్ జరిగాయి. అందులో పాల్గొన్న సారంగ్ అనే యువకుడు తన దరఖాస్తులో ప్రియాంక చోప్రాను చంపాలనుంది అని రాశాడు. ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోన్న నేహా ధూఫియా అలా ఎందుకు అనుకుంటున్నావని సారంగ్ ను ప్రశ్నించింది. దీంతో అతను నేహాకు ప్రియాంక వల్ల తాను ఎదురుకొన్న ఇబ్బందులను తెలిపాడు. “గతంలో నేను స్టేజ్ పై బ్యాకప్ డ్యాన్సర్ గా ఉన్నప్పుడు ప్రియాంక మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది. మేము ఎంతో కష్టపడి రిహార్సల్స్ చేస్తే చివరి నిమిషంలో ప్రియాంక స్టెప్స్ మార్చేసేది. ఇంకా కొన్ని డిమాండ్లు కూడా చేసేది. దీంతో లంచ్ బ్రేక్ కూడా లేకుండా ఉదయం నుంచి ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఈ విషయాన్ని ఆమెకు వివరించలేక, ఎదురు చెప్పలేక ఎన్నో ఇబ్బందులు పడ్డాము” అని చెప్పుకొచ్చాడు సారంగ్.

Related posts