telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

2020లో బిల్‌బోర్డ్ మ్యూజిక్‌ అవార్డ్స్‌కు నామినేట్ అయిన జోనస్ బ్రదర్స్

Priyanka

2020లో బిల్‌బోర్డ్ మ్యూజిక్‌ అవార్డ్స్‌కు జోనస్‌ బ్రదర్స్‌ నామినేట్‌ అయ్యారు. ఈ విషయాన్ని వారు ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు. దీనిపై నిక్‌ జోనస్‌ భార్య, బాలీవుడ్‌, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్పందించారు. వారికి అభినందనలు తెలిపారు. కాగా 2020లో బిల్‌బోర్డ్ మ్యూజిక్‌ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్స్‌ను అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్‌లో జరగాల్సిన ఈ అవార్డుల కార్యక్రమం కోవిడ్‌ ప్రభావంతో అక్టోబర్‌కి వాయిదా పడింది. ఈ అవార్డ్స్‌ వేడుక అక్టోబర్‌ 14న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతుంది. ఈ నామినేషన్స్‌లో మన ప్రియాంక భర్త నిక్‌ జోనస్‌, ఆయన సోదరుల బృందం నామినేషన్స్‌లో పోటీ పడుతుంది. 55 కేటగిరీల్లో టాప్‌ ఆర్టిస్ట్‌, టాప్‌ డ్యూయొ/గ్రూప్‌, టాప్‌ రేడియో సాంగ్‌ ఆర్టిస్ట్‌, టాప్‌ రేడియో సాంగ్‌ విభాగాల్లో జోనస్‌ బ్రదర్స్‌ నామినేట్‌ అయ్యారు. మరి జోనస్‌ బ్రదర్స్‌ నామినేషన్స్‌కే పరిమితమవుతారా? లేక విజేతలుగా కూడా నిలుస్తారనేది చూడాలి.

Related posts