telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అవును ప్రేమలో ఉన్నాం…” అంటున్న బిగ్ బాస్ జంట

Bigg Boss

కరోనా కారణంగా సెలెబ్రిటీలతో సహా సామాన్యులు కూడా క్వారంటైన్ లైఫ్ ను గడుపుతున్నారు. తాజాగా హిందీ ‘బిగ్‌బాస్‌ 11’ కంటెస్టెంట్స్‌ ప్రియాంక్‌ శర్మ, బెనాఫ్‌షా సూనావాలా వారి రిలేషన్‌షిప్‌ను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. రెండేళ్లు నుంచి సిక్రేట్‌గా డేట్ చేస్తున్న ఈ జంట వారి ప్రేమను అధికారంగా వెల్లడించారు. ప్రియాంక్‌ వారిద్దరూ సన్నిహితం ఉన్న పిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘అవును ప్రేమలో ఉన్నాం’ అనే క్యాప్షన్‌కు హార్ట్‌ ఎమోజీని యాడ్ చేయగా.. బెనాఫ్‌షా కూడా అదే చిత్రాన్ని ఇన్‌స్టాలో పంచుకుంది. ‘మా ప్రేమను అందరిలాంటి ప్రేమలా చూడకండి. ఎందుకంటే నాది అసాధారణమైన ప్రేమ’ అని వర్ణించిందామె. బిగ్‌బాస్‌ హౌజ్‌లో సన్నిహితంగా మెలిగిన ఈ జంట బయటకు వచ్చాక కూడా చెట్టపట్టాలేసుకు తిరుగుతూ ప్రేమయాణం సాగించారు. అయితే వారి ప్రేమపై ప్రశ్నించినప్పుడల్లా.. అందరిలానే.. ‘మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్.. బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే’ అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాగా ‘బిగ్ బాస్ 11’లో పార్టిసిపెట్ చేయడానికి ముందు బెనాఫ్‌షా, నటుడు వరుణ్ సూద్‌తో డేటింగ్ చేసింది. ఇక హౌజ్‌ నుంచి బయటకు రాగానే వరుణ్‌కు బ్రేకప్‌ చెప్పి ఈ భామ ప్రియాంక్‌తో రిలేషన్ స్టార్ట్ చేసింది.

Related posts