telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియా వారియర్ ట్యాటూకు అర్థం ఇదే…!

Priya-Prakash-Varrier

కన్నుగీటుతో కుర్రకారు మనసులను దోచుకున్న నటి ప్రియా వారియర్. ఆమె నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ సినిమాలో హీరోను చూసి ఆమె కన్నుగీటిన తీర… అందరి దృష్టిని ఆ సినిమా వైపుకు తిప్పింది. తెలుగులోనూ ప్రియా వారియర్ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకోగలిగింది. వాళ్లంతా కూడా ఈ సినిమా తెలుగులోకి ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఒమర్ లులూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులోను విడుదల చేస్తున్నారు. ‘లవర్స్ డే’ అనే టైటిల్ తో ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. గురురాజ్, వినోద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి షాన్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రియా ప్రకాష్ వారియర్ తన కట్టుబొట్టుతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె ఎదపై ఉన్న ట్యాటూ కెమెరాల కంటబడింది. దీంతో వెంటనే ప్రియా ప్రకాష్ వారియర్ అభిమానులు ఆ ట్యాటూకు అర్థం ఏమిటా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రియా ప్రకాష్ వారియర్ ఎదపై ఉన్న ట్యాటూ “Carpe Diem”… ఇది లాటిన్ భాషకు చెందిన పదం. దీని అర్థం… “ఫ్యూచర్ మీద ఆశ, నమ్మకంతో జీవించండి”…

Related posts