telugu navyamedia
సినిమా వార్తలు

నోరు విప్పితే పరువు పోతుంది… కాలమే సమాధానం చెప్తుంది : ప్రియా వారియర్

Priya Prakash Varrier images

ఒక్క కన్నుగీటుతో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్. అయితే ఆమె మొదటి సినిమా విడుదలతోనే పరాజయం అందుకుని, సహనటి నూరిన్ షరీఫ్, దర్శకుడు ఒమర్ లులు ద్వారా విమర్శల పాలైంది. తాజాగా ఈ విషయంపై స్పందించింది ప్రియా ప్రకాష్ వారియర్. అసలేం జరిగిందో బయటకు చెబితే తనను విమర్శిస్తున్న వారి పరువు పోతుందని, తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, తనను విమర్శిస్తున్న వారికి కాలమే సమాధానం చెబుతుందని, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రియా వ్యాఖ్యలతో అసలేం జరిగిందా ? అనే ఆసక్తి మొదలైంది ఆమె అభిమానుల్లో.

అసలు సంగతి ఏంటనేది తెలియదు కానీ… “దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అనే నానుడి ఇండస్ట్రీలోని నటీనటులకు బాగా సరిపోతుంది. క్రేజ్ ఉన్నప్పుడే నటీనటులు మంచి సినిమాలను ఎంచుకుంటూ తమకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలి. లేదంటే ప్రియా ప్రకాష్ వారియర్ లా చిక్కులు ఎదుర్కోక తప్పదు. “ఒరు అదార్ లవ్” సినిమా విడుదలకు ముందు ప్రియా ప్రకాష్ వారియర్ కు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. ఇంకా సినిమా కూడా విడుదల కాకముందే దాదాపు అన్ని భాషల నుంచి ఆమెకు ఆఫర్ల వెల్లువలా వచ్చి పడ్డాయి. కానీ వాటన్నింటినీ వదిలేసింది ప్రియా. ఇప్పుడు సినిమా పరాజయం పాలవ్వడంతో ప్రియా పరిస్థితి తారుమారైంది. సినిమాలోని తన సహనటి నూరిన్ నుంచి విమర్శలను ఎదుర్కొంది ప్రియా. ఇప్పుడు దర్శకుడు ఒమర్ లులు కూడా ప్రియా ప్రకాష్ కు అసలు యాక్టింగ్ రాదని, ప్రియా వల్లనే సినిమా పరాజయం పాలైందని విమర్శించారు.

Related posts