telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీదేవి బంగ్లా వివాదం… నాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్న ప్రియా వారియర్

SRIDEVI BUNGALOW

కన్నుగీటి పాపులారిటీ దక్కించుకున్న స్టార్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్ లో “శ్రీదేవి బంగ్లా” అనే సినిమాలో నటించింది. ప్రశాంత్ మాంబుల్లి వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీదేవి అనే పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ రీల్ లైఫ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ ట్రైలర్ లో హీరోయిన్ చివరకి బాత్ టబ్ లో శవంగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు దివంగత నటి శ్రీదేవి మరణాన్ని గుర్తు తెచ్చేలా ఉందని అన్నారు. ఈ చిత్రంపై శ్రీదేవి భర్త బోనికపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రంలో శ్రీదేవి మరణించిన తరహాలో బాత్ టబ్ లో కొన్ని సన్నివేశాలు చిత్రికరించడంతో వివాదం మొదలయింది. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదంపై ప్రియా వారియర్ తాజాగా స్పందించింది.

“ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ చిత్రంలో నటించమని దర్శకుడు, నిర్మాతలు అవకాశం ఇచ్చారు. నటిగా నా పని నేను చేశా. దర్శక నిర్మాతలకు సంబంధించిన విషయం ఇది వ్యక్తిగతంగా ఎవరిని భాదపెట్టాలనే ఉద్దేశం తమ చిత్ర యూనిట్ కు లేదు. ఇలాంటి వివాదాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీదేవి మేడంకు నేను పెద్ద అభిమానిని. ఆమెని కించపరచాలనే ఉద్దేశం ఎవరికీ లేదు” అని స్పష్టం చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమా నిరాశ పరచడంతో ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకుంది వింక్ గర్ల్. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts