telugu navyamedia
సినిమా వార్తలు

అదరగొట్టేస్తున్న “లవర్స్ డే” సాంగ్

priya varriar movie lovers day on 14th

కన్నుగీటుతో కుర్రకారు మనసులను దోచుకున్న నటి ప్రియా వారియర్. ఆమె నటించిన “ఒరు ఆదార్ లవ్” అనే మలయాళ సినిమాలో హీరోను చూసి ఆమె కన్నుగీటిన తీరు… అందరి దృష్టిని ఆ సినిమా వైపుకు తిప్పింది. తెలుగులోనూ ప్రియా వారియర్ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకోగలిగింది. ఒమర్ లులూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. “లవర్స్ డే” అనే టైటిల్ తో ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. గురురాజ్ .. వినోద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి షాన్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి “ఓ మైగాడ్ పోయా…” అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కూడా ఈ పాటపై ఓ లుక్కేయండి మరి.

Related posts