telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రైవేటు విద్యాసంస్థల సమస్యలపై ఎంపీ నామా కు ట్రస్మా విజ్ఞప్తి

MP Nama Nageshwar Rao

ప్రైవేటు విద్యాసంస్థల సమస్యలపై ఎంపీ నామా నాగేశ్వరరావుకు ట్రస్మా తరపున విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా ఆరు నెలలుగా పాఠశాలలు మూసి ఉంచిన తరుణంలో ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత ముఖ్యమైన విద్యార్థి దశలో ఈ ఆరు నెలల కాలంలో జరిగిన విద్యా నష్టo పూడ్చలేనిది అని పేర్కొన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థల బోధన బోధనేతర సిబ్బంది ఆర్థికంగా సామాజికంగా అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్న కారణంగా ప్రైవేటు సంస్థలను వారి సిబ్బందిని ఆదుకోవాలని ట్రస్మా తరపున శ్రీ నామా నాగేశ్వరరావు గారికి విజ్ఞప్తి చేశామని అన్నారు. బి బి ఎం స్కూల్ ఖమ్మం కాంతారావు గారు ట్రస్మా సభ్యులను నామా నాగేశ్వరరావు గారికి పరిచయం చేస్తూ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

ఫౌండర్ ప్రెసిడెంట్ కేశ వీరన్న గారు మాట్లాడుతూ పాఠశాల ఫీజులు, సిబ్బంది జీతభత్యాలు, బిల్డింగ్ కిరాయిల చెల్లింపులపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ , ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సాయం ఆశించ లేదని ప్రస్తుత పరిస్థితులలో ఈ సమస్యలకు మార్గం చూపే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, సమస్యలకు మార్గం చూపాలని ఆయన కోరారు.

ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు గారు మాట్లాడుతూ మార్చి నుండి విద్యాసంస్థల స్కూల్ బస్సులు నిలిపివేసి ఉన్నాయని ఇన్సూరెన్స్ లు కూడా పెండింగ్లో ఉన్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ లేకుండా ఉండే విధంగా చూడాలని ఇన్స్టాల్మెంట్ చెల్లింపులపై మారిటోరియం విధించునట్లుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ మధుసూదన్ తన విజ్ఞాపనలలో ప్రైవేట్ విద్యా సంస్థలకు ఫుడ్ సెక్యూరిటీ లోన్స్ మరియు 12 నెలల మారిటోరియం ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయించాలని ఉపాధ్యాయులకు గురుదక్షిణ కింద ఐదు వేల రూపాయలు ఇచ్చే విధంగా చూడాలని కోరారు. ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయి ఇతర పనులకు వెళ్తున్నారు గనుక గురుదక్షిణ తో వారి ఆత్మాభిమానాన్ని వారి జీవన గమనాన్ని కాపాడిన వారం అవుతామని తదనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందించి నట్టుగా చూడాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో హార్వెస్ట్ స్కూల్ మారుతి , న్యూ విజన్ స్కూల్ ప్రసాద్ , రిసినన్స్ స్కూల్ నాగేందర్ , విజ్ఞాన్ స్కూల్ ఇస్మాయిల్, గీతాంజలి స్కూల్ అప్పారావు, జాఫర్ తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

గత ఆరు నెలలుగా తనతో పాటు ఇతర ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు మరియు సిబ్బంది పడుతున్న వర్ణనాతీతమైన కష్టాలను చూసి చలించి పోయిన ట్రస్మా అధికార ప్రతినిధి శేషు కుమార్ గారు మానవత్వంతో చొరవ చూపించి ఎంపీ నామా నాగేశ్వరరావు గారితో తనకున్న సత్సంబంధాలతో జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీ గారిని మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రస్మా నాయకులను జూమ్ మీటింగ్ ద్వారా ఒక చోటకు చేర్చి ప్రైవేటు విద్యాసంస్థల పడుతున్న బాధలను సిబ్బంది కష్టాలను తెలియజేసే విధంగా ట్రస్మా అధికార ప్రతినిధి శ్రీ శేషు కుమార్ , ఖమ్మం గారు చేసిన ఈ సహాయానికి రాష్ట్ర కార్యవర్గం ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు

ఈ సమావేశంలో సమస్యలను సహృదయంతో అర్థం చేసుకున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు ప్రతిస్పందిస్తూ కరోనా వలన భౌతికంగా కలవ లేకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వంనకు సంబంధించిన వివిధ శాఖల సమస్యలపై ఆ శాఖ మంత్రులతో సవివరంగా మాట్లాడతానని, సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందని, ప్రైవేటు విద్యాసంస్థల విషయంలో ఐఆర్డిఎ మరియు ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, పెండింగ్ ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు అని యాదగిరి శేఖర్ రావు తెలియజేశారు.

తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ట్రస్మా సభ్యులకు ఉంటాయని ప్రజా సౌకర్యాలకు ప్రజాసంక్షేమానికి తనను ఉపయోగించుకోవాలని తెలుపుతూ తూ సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని మరొక్క మారు పునరుద్ఘాటించారు అని శేఖర్ రావు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ ట్రస్మా తరఫున మా సమస్యలను సహృదయంతో అర్థం చేసుకొని ప్రైవేటు విద్యాసంస్థల తరఫున తన గళాన్ని వినిపించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి ప్రైవేటు విద్యాసంస్థల మరియు వారి సిబ్బంది యొక్క సమస్యను తీసుకువెళ్లిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కుటుంబం తరఫున తెలియజేస్తున్నట్టు యాదగిరి శేఖర్ రావు తెలిపారు.

Related posts