telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ విద్యా వార్తలు

అసలే స్కూల్ ఫీజులు భారం.. దానిపై వడ్డీ కూడా వసూలు .. ఆలస్యం అయితే అంతేనట..

private schools collecting interest on late fee

ప్రభుత్వ చేతకాని తనంతో ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీ రోజురోజుకు పెరిగిపోతున్నది. తల్లిదండ్రుల బలహీనతలను ఆసరగా చేసుకుంటున్న యాజమాన్యాలు అందినకాడికి దుండుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్, డొనేషన్ వంటి ఫీజులు మొదలు కొని పరీక్ష ఫీజుల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి ఏటా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తాజాగా ఓ స్కూల్ యజమాన్యం ఫీజుచెల్లింపులో ఆలస్యంఅవుతుందనే నెపంతో వడ్డీ వసూలు చేస్తుంది.

ఇంత జరుగుతున్నా సంబంధింత అధికారులు నోరుమెదపక పోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్పటికీ స్కూల్ నిర్వాహకులు ఇచ్చే అమ్యాయ్యాల కారణంగా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఫలితంగా పాఠశాలల యాజమాన్యాలు పేరెంట్స్ ముక్కుపిండి మరీ అధికఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో అధికంగా చోటు చేసుకుంటుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటీకరణ ఆదాయం కోసం అని ప్రభుత్వం చెపుతున్నా, ప్రభుత్వ చేతకాని తనాన్ని ఇలా కప్పిపుచ్చుకుంటుందంటూ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి చేతనైతే, ఆ రంగంలోనే అన్నీ సేవలు ప్రజలకు సరిగ్గా అందేవని, అలా చేతకాకనో లేక ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే కోట్ల ముడుపుల కోసమో ప్రభుత్వాలు, ప్రైవేట్ వారి సంకనాకుతూ బ్రతికేస్తూ.. మరో పక్క వాళ్ళని ఓట్లేసి గెలిపించిన ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని వారు ఘాటుగా స్పందించారు.

Related posts