telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తమిళనాడులో … ప్రభుత్వ వైద్యుల నిరవధిక సమ్మెలు..

private doctors protest in tamilanadu

రాష్ట్రంలో ప్రభుత్వ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. శుక్రవారం నుంచి సుమారు 15వేల మంది డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. ఎమర్జెన్సీ, లేబర్ వార్డులకు మాత్రమే డాక్టర్లు అందుబాటులో ఉంటారని ప్రభుత్వ డాక్టర్ల సమాఖ్య వెల్లడించింది. ఔట్ పేషెంట్లు, ఇతర ఇన్ పేషెంట్ వార్డులకు సేవలు ఉండవన్నారు. అయితే ప్రభుత్వ డాక్టర్లకు సంబందించిన మరో సంఘం మాత్రం తాము రెండు రోజులు మాత్రమే సమ్మెలో పాల్గొననున్నట్లు స్పష్టం చేసింది. క్రమక్రమంగా ప్రమోషన్లు ఇవ్వాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల ప్రభుత్వ డాక్టర్ల తరహాలో తమకు కూడా జీతాలు ఇవ్వాలని మరో డిమాండ్ పెట్టారు. ప్రభుత్వ డాక్టర్లకు పీజీలో 50 శాతం కోటా ఇవ్వాలన్నారు. డిమాండ్లపై ప్రభుత్వంతో డాక్టర్లు చర్చలు జరిపినా అవి విఫలం అయ్యాయి. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరిగాయని, డాక్టర్లు అంతా తమ విధుల్లో చేరాలని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ విజయభాస్కర్ కోరారు.

Related posts