telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ప్రింట్‌ మీడియా ప్రకటన రేట్లు పెంపు

Print media ads Rates hike Govt

దేశ వ్యాప్తంగా  వివిధ భాషల్లో ప్రచురితమయ్యే వార్త పత్రికలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. చిన్న,మధ్య వ్యాపార పత్రికలకు జారీ చేసే ప్రకటనల రేట్లను 25శాతం పెంచింది. ప్రింట్ మీడియాలో ప్రకటన రేట్లు సవరిస్తూ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. 8 వ రేట్ స్ట్రక్చర్ కమిటీ సిఫార్సులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సవరించిన రేట్లు మంగళవారం నుంచి మూడు సంవత్సరాల పాటు అమల్లో వుంటాయని ప్రకటించింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్‌ కమ్యూనికేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. అంతర్జాతీయంగా న్యూస్‌ ప్రింట్‌, ప్రాసెసింగ్‌ చార్జీలు, ఇతర కారణాల రీత్యా ఈ పెంపును చేసినట్టు వెల్లడించింది.

ప్రభుత్వ నిర్ణయం ముఖ్యంగా ప్రాంతీయ మరియు స్థానిక భాషలలోని చిన్నపత్రికలకు ప్రయోజనకరంగా ఉంటుందని పత్రికల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అయితే ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఈ నిర్ణయంపై విమర‍్శలు గుప్పించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓడిపోతామన్న భయంతో పాలక పార్టీ బీజేపీ వేసిన మరొక ఎత్తుగడగా పేర్కొంది. డబ్బుతో మీడియాను నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఆరోపించారు.

Related posts