telugu navyamedia
సినిమా వార్తలు

నవంబర్ లో విడుదలకు సిద్ధమైన “ప్రెషర్ కుక్కర్”

PC

సాయిరోన‌క్‌, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `ప్రెష‌ర్ కుక్క‌ర్‌`. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. కాన్సెప్ట్ నచ్చిన డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ఈ సినిమా టీజ‌ర్‌ను క‌ట్ చేయ‌డం విశేషం. సుజోయ్‌, సుశీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సునీల్ క‌శ్య‌ప్‌, రాహుల్ సిప్లిగంజ్‌, స్మ‌ర‌ణ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. స‌క్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత అభిషేక్ పిక్చ‌ర్స్ అభిషేక్ నామా `ప్రెష‌ర్ కుక్క‌ర్‌` థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్‌`, `రాక్ష‌సుడు` వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ అభిషేక్ నామా రీసెంట్‌గా `జార్జ్‌రెడ్డి` సినిమా హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నారు.

Related posts