telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కొలంబో : … అధ్యక్షపదవికి పోలింగ్ ప్రారంభం.. పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం..

president elections in srilanka and attacks

నేటి ఉదయం నుండి శ్రీలంక అధ్యక్ష పదవికి పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే మైనార్టీ ముస్లిం ఓటర్లను తరలిస్తున్న బస్సులను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని అగంతకుడు కాల్పులు జరిపాడు. కొన్ని చోట్ల పోలింగ్‌ను అడ్డుకునేందుకు రహదారులపై టైర్లను కాల్చేశారు. రోడ్డుకు అడ్డంగా చెట్లను కొట్టేశారు.

ఓటర్లను తరలిస్తున్న బస్సులకు పోలీసులు పహారా కాస్తున్నారు. బస్సులపై పలుచోట్ల రాళ్లు కూడా రువ్వారు. అయితే ఈ ఘటనల్లో ఎవరైనా గాయపడ్డారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. పోటీ ముగ్గురి మధ్యే 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, మాజీ రక్షణ మంత్రి గోటబయ్యా రాజపక్స, అధికార పార్టీ అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాస, నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ సంకీర్ణ కూటమి అభ్యర్థి అనురా కుమార దిస్సన్నాయకే మధ్యే పోటీ ఉండనుంది.1.59కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు.

Related posts