telugu navyamedia
రాజకీయ

భార‌త 15వ రాష్ర్ట‌ప‌తిగా ద్రౌపది ముర్ము ..రాష్ట్రపతి పీఠం ఎక్కుతున్న తొలి ఆదివాసీ మహిళ

*భార‌త 15వ రాష్ర్ట‌ప‌తిగా ముర్ము
*మొద‌టి గిరిజన మహిళ రాష్ర్ట‌ప‌తి ద్రౌప‌తి ముర్ము
*3 రౌండ్లలోనూ ద్రౌప‌తి ముర్ము
*మెజార్టీ మార్క్ దాటిన ద్రౌప‌తి ముర్ము

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. దీంతో భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు.

దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయ దుందుభి మోగించారు. సగానికి పైగా ఓట్లు సాధించిన ముర్ము ప్రత్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

మొద‌టి రౌండ్ లో

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో . మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 3,78,000 విలువైన 540 ఓట్లను ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దక్కించుకున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్​ సిన్హాకు 1,45,600 విలువైన 208 ఓట్లు పడ్డాయి. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి

రెండో రౌండ్ లో

రెండో రౌండ్‌లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్‌ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి.

మరోవైపు బీజేపీ ప్రధాన కార్యాలయంలో వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు..

 

Related posts