telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేమంటే ?

devadasu poetry corner

ప్రేమంటే రెండు ఆయస్కాంతాల ఆకర్షణ
ధృవాలు వ్యతిరేకమైనా ఆకర్షణ ఇరువురివైపే
కదిలే ప్రతీక్షణం నడిచే కాలమే
కలిసుంటే యుగమే క్షణం
ఎదురుచూపులలో క్షణమే యుగం
కాలగమనానికి కొలమానం లేనిదే ప్రేమంటే
ఎదురు చూపులు తీయని వేదన
కలయికలో తలపులు తీయన
హృదయాలయంలో ప్రతిష్టాపనలతో
ఆహృదయాలే ప్రేమ దేవాలయాలు
ఆ కన్నులలో సుందరస్వప్నాలు గోచరమౌతాయి
మనసుకాన్వాసుపై ఆశల రంగుల్లో పరుచుకుంటాయి
ఆ తీయని మాటలు మధు ఊటలుగా మదిని తాకుతాయి
ఆ నవ్వుల పువ్వులు ప్రేమ పరిమళాలు గుభాళిస్తాయి
ఆత్మలు పెన వేసుకుంటాయి కరచాలనం చేస్తూ నాతిచరామి మంత్రోచ్ఛరణ చేస్తూ…!
ప్రేమంటే టైమ్ పాస్ ఆట కాదు
ప్రేమంటే ఓ పవిత్రబంధం..!
అందుకే ప్రేమికులారా ! ప్రేమించకండి!
మీ ఆత్మలను మమైకం చేయలేనప్పుడు!
ప్రేమికులారా ప్రేమించకండి…
ప్రేమను ప్రేమగా ఆలింగనం చేసుకోలేకుంటే!
ఆ కలిసిన ఆత్మ బంధం తెంపేసుకుంటామంటే!
ప్రేమించకండి!..ప్రేమించకండి…!

-అవేరా

Related posts