telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

“ప్రేమవిందు”

ushodaya sundarimani poetry corner
అధరాల ఆకాశంలోంచి
చిరునవ్వుల చినుకులు కురిపించి
మనసు మైదానాన్ని తడిపిముద్దచేస్తావు
నీ కనులకొలనులో నా ప్రతిబింబానికి ప్రేమ స్నానం  చేయించి
హృదయాన్ని పరవశాల పల్లకిలో ఉరేగిస్తావు
వలపుల ఊసుల శ్వాసలతో ప్రేమ మత్తులో పడివేస్తావు
నీ ప్రేమ అయస్కాంత తరంగాల ఆకర్షణకు  లోనై
నా మది వలపుల తుమ్మెదై
నీ చుట్టే నిరంతరం తిరుగుతుంది
అతిలోకసుందరీ! హృదయేశ్వరీ!!
ప్రేమానుభూతుల వెన్నెల జల్లులలో 
నాకు నిత్యం ‘ప్రేమవిందు”
–గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts