telugu navyamedia
సినిమా వార్తలు

చిత్రలహరి : “ప్రేమ వెన్నెల…” లిరికల్ వీడియో సాంగ్

Chitralahari

సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో “చిత్రలహరి” సినిమా రూపొందుతోంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో సునీల్, వెన్నెలకిషోర్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ చిత్రం టీజర్ ని ఇటీవలే విడుదల చేసారు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది ప్రేక్షకుల్లో. ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “ప్రేమ వెన్నెల” అంటూ సాగే మూడవ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాట యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ‘చిత్రలహరి’లోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది చిత్ర బృందం.

Related posts