telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ప్రేమ వర్ణన…

prema varnana poetry corner

నీ తలపుల తో కాలాన్ని మరచిపోయి…..
నీ ప్రేమ అనే కలం తో నా అక్షర రూపాలు….
అందమైన వర్ణనలయ్యాయి !
నీ పై ఆశలతో మనసులోని కోరికలన్నీ….
మత్తెక్కించే పూల పరిమళాల లయ్యా యి !
నీ అధరా ల స్పర్శలో …….
నా పెదాలు తేనె బిందువు లయ్యాయి. !
నీ సరాగాల సంతోషం లో ….
నా లోని అణువణువు……
సాయం సంధ్యా వర్ణం లో……
విరహ పంజరం నుంచి
విడుదలై స్వేచ్చా విహారం చేస్తున్న…..
విపంచిలయ్యాయి !
మనసు లోని మధుర జ్ఞాపకాలు……
పురివిప్పిన మాయురమై …..
నీ ప్రేమ కవిత లో అక్షర నాట్యం చేస్తున్నాయి.

-జె.పద్మావతి,
ఆదోని.

Related posts