telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేమ పందిరినై..!

prema pakshulai poetry corner
మనసులో చెలరేగే
దిగులు మంటల్ని
నీ చల్లని మాటల జల్లులు
చప్పున చల్లార్చుతాయి!
ఉషోదయాన నీ పలకరింపు
నునులేత కిరణాలు మోసుకొచ్చి
ఎదలోతుల్లో పులకరింతల్ని
సుతారంగా ఒంపి పోతుంది!
నీ అక్షరాలు
నిలువెల్లా చుట్టుకొని
నన్నొక పరిమళాల
పూదోటను చేస్తాయి!
నీ చూపుల 
వెచ్చని స్పర్శకు 
కరిగిన హిమ శిఖరాన్నయి
నీ లేత పాదాలను స్పృశిస్తాను!
నీ బాహువుల మధ్య
ప్రేమ ఖైదీ గా నేనున్నపుడు
మల్లె తీగ అల్లుకున్న
పచ్చని పందిరినవుతాను!
            -వెన్నెల సత్యం
              షాద్ నగర్

Related posts