telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

”ప్రేమ హృదయం”…

prema hrudayam poetry corner
రెండు పడుచు హృదయాలు కలసినవి
ప్రేమకు చిహ్నంగా నిలిచినవి
ఇరు తనువులుతన్మయత్వంతో
మల్లెతీగలా అల్లుకున్నవి
మనసు మందారాలు పూసినవి
ప్రేమ పరిమళాలు వెదజల్లినవి
నెమలి ఫించంలా విప్పిన
ప్రేమకు ఛత్రమై నీడైనది
రెండు మనసులు ఏకమైనవి
పవిత్ర ప్రేమకు సాక్ష్యమైనవి
సూర్యోదయపు కాంతుల్లో
ప్రేమికుల నిజప్రేమ గెలిచినది
-గద్వాలసోమన్న, ఎమ్మిగనూరు

Related posts