telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేమ హంస…

prema varnana poetry corner
కనులకొలనులో
ప్రేమ హంసవై 
కనువిందుచేస్తావు
గుండె గున్నమామిడి
కొమ్మపై కోకిలమ్మవై
కొలువుదీరి కమ్మని
వలపుల రాగాలతో ,
ప్రేమ గీతాలతో
వీనులవిందు చేస్తావు
హృదయ క్షేత్రంలో
పురివిప్పిన మయూరమై
వయ్యారాలు ఒలకబోస్తూ
ప్రేమవిందు చేస్తావు
తనువువనంలో 
ప్రేమమకరందం గ్రోల
సౌందర్య సీతాకోకచిలుకవై
ఇంద్రధనుస్సు వర్ణాలతో
వలపుతీరా విహరిస్తావు
చిరునవ్వుల చెరువులో
 ప్రేమఅలలపై పడవవై పయనిస్తావు
మనోసరస్సులో ‘ప్రేమ హంస’వై
మది మందారంపై
చిలిపి తుమ్మెదవై
చక్కిలిగింతలు పెడుతావు
గుసగుసలాడే ఊహల రెక్కలు కట్టుకుని ప్రేమాకాశంలో  చెలి
ప్రేమపావురమై సంచరిస్తోంది
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts