telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేమ బానిస..

prema kosam poetry corner
చెలీ… 
నా మాటలు..    
నా చేష్టలు.. 
సున్నితమైన 
నీ హృదయాన్ని తాకి.. 
నోట మాటరాక మూగబోయెనో…
మది మౌనరాగాలూదెనో..
మనసు నొచ్చుకొనెనో..
పారవశ్యంతో
సొగసు విచ్చుకొనెనో.. 
ఊసులు ఊయలూగి 
ఉక్కిరిబిక్కిరాయెనో… 
సాన్నిహిత్యం కోసం 
తనువు తహతహలాడెనో… 
నాపై చిరాకుతో 
చిరుబురులాడెనో… 
అసహ్యంతో దూషించునో 
ఆశలపల్లకిలో ఊరేగించునో… 
అయినా… 
ఇంకేమైనా.. 
నీ ప్రేమలోనే బందిని.. 
నీ ప్రేమకై సదా బానిసనీ… 

prema banisani poetry corner

-రాశ్రీ

Related posts