telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

గర్భిణీలు తప్పకుండ .. తీసుకోవాల్సిన జ్యూస్… ఇదే తెలుసా..!

pregnant women should take orange juice

స్త్రీలు గర్భం గాల్చినప్పటి నుండి బిడ్డ పుట్టే వరకు చక్కని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులే కాదు, మన పెద్దలు కూడా చెబుతుంటారు. అందుకనే వారు నిత్యం అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తినాల్సి ఉంటుంది. దీంతో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బిడ్డ ఎదుగుదల కూడా సరిగ్గా ఉంటుంది. అయితే గర్భిణీలు నిత్యం తీసుకోవాల్సిన పోషకాహారాల్లో నారింజ పండు జ్యూస్ కూడా ముఖ్యమైనదే. దీన్ని గర్భిణీలు నిత్యం ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం…!

* నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బిడ్డ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనితో బిడ్డ పుట్టాక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. కనుక గర్భిణీలు రోజూ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి.

pregnant women should take orange juice* ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి వల్ల శరీరం ఐరన్‌ను బాగా గ్రహిస్తుంది. తద్వారా బిడ్డ, తల్లి ఇద్దరికీ రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.

* నారింజ పండ్లలో ఫోలేట్ కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది శిశువు ఎదుగుదలకు ఎంతో అవసరం. అందువల్ల గర్భిణీలు నిత్యం నారింజ పండు రసం తాగాలి.

* గర్భంతో ఉన్న స్త్రీలలో చాలా మందికి హైబీపీ సమస్య వస్తుంటుంది. అలాంటి వారు ఆరెంజ్ జ్యూస్ తాగితే బీపీ తగ్గుతుంది.

* శక్తి లేనట్లుగా, నిస్సత్తువగా అనిపించే గర్భిణీలు ఆరెంజ్ జ్యూస్‌ను తాగితే శక్తి పుంజుకోవచ్చు, ఉత్సాహంగా ఉంటారు.

Related posts