ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు వార్తలు సామాజిక

గుండె పోటుకు…జాగర్తలు ఇలా…

precautions to heart health problems

గుండెపోటు అనేది నేటి కాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తుంది. గతంలో అయితే ఏ పెద్ద వయస్సు వారికో వచ్చేది. కానీ ఇటీవల పిన్న వయస్సులో ఉన్న వారు కూడా గుండెపోటుతో మరణించడం మనం గమనిస్తున్న విషయమే. అందుకే నేటి కాలంలో అందరూ తీసుకోదగ్గ జాగర్తలు తెలుసుకుందాం.

గుండెపోటుకు ప్రధాన కారణం ఒత్తిడి.. ఈ ఒత్తిడి దేనివలన వస్తుందో గ్రహించాలి, ఆయా పరిస్థితులను అయితేనేమి, అలవాట్లు అయితేనేమి దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించే అనేక చిన్న చిన్న వ్యాయామాలు, యోగాలో అనేక సులభమైన ఆసనాలు ఉన్నాయి.. వాటికి కాస్త సమయం కేటాయించినట్టయతే ఖచ్చితంగా ఒత్తిడి అనేదానికి శాశ్వతంగా దూరంగా ఉండవచ్చు.

ఇక ఆహరం.. పరుగులు పెట్టాల్సిన జీవితం గడుపుతున్నప్పుడు ఏదో దొరికింది తినడం తప్ప, స్వయంగా చేసుకొని తినడం, లేదా ఇదే ఆరోగ్యానికి మంచి ఆహరం అని తెలుసుకొని, ఎంచుకొని మరి దానినే ఆహారంలో చేర్చుకోవాలి అనేవి చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. కానీ సమయం చేసుకొని మెరుగైన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాదు, ఆయుః ప్రమాణం కూడా పెరిగి మీమీ బంధువులతో ఎక్కువ కాలం ఉండవచ్చు. ముందు ఆహరం ఏది తీసుకోవాలో ప్రాథమిక విచారణ అవసరం, అనంతరం దానిని ప్రణాళికా బద్దంగా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

కొవ్వు తో సహా ఏది ఎంత తీసుకోవాలో తెలుసుకొని అవి సమయానుకూలంగా తీసుకుంటుండాలి. ఇక తాజా పండ్లు, కూరగాయలలో శరీరానికి అవసరమైన విటమిన్లు, నూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి లభిస్తాయి. ఇవన్నీ తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి మేలు చేస్తాయి.

ఆహరం సరిగా తీసుకోవడం వలన బరువు అదుపులో ఉంటుంది, శరీరంలో అనవసర కొవ్వులు చేరే అవకాశం ఉండదు..; ఇక కాసేపైనా రోజు వ్యాయామం.. ఈ రెండు రోజువారీగా అలవర్చుకుంటే గుండె సంబంధిత అనారోగ్య సమస్యల నుండి శాశ్వతంగా దూరంగా ఉండవచ్చు.

Related posts

రూ.3 కోట్ల టోకరా… మంత్రి సహాయంతో ఆందోళన చేపట్టిన బాధితులు

nagaraj chanti

హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటుకు… ప్రభుత్వం స్థలం కేటాయింపు

madhu

ఈ ఆలయాలలో పురుషులు నిషేధం

jithu j

Leave a Comment