• Home
  • Uncategorized
  • ఒకే వేదికపై ముగ్గురు యంగ్ స్టార్స్ ?
Uncategorized సినిమా వార్తలు

ఒకే వేదికపై ముగ్గురు యంగ్ స్టార్స్ ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ  కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగు పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. 
 
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అయితే ఈ వేడుకలో టాలీవుడ్ యంగ్  స్టార్ లు ముగ్గురు పాల్గొనబోతున్నారనే టాక్ బయటకు వచ్చింది.  ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లను ఆహ్వనించే యోచనలో ఉన్నారట భరత్‌ అనే నేను చిత్రయూనిట్‌.  మహేష్ బాబుతో పాటు తారక్, రాంచరణ్ లు ఒకే వేదికపై కనిపించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్‌ లో రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా మల్టీస్టారర్‌ చేయనున్నారు. దీంతో మహేష్ సినిమా వేడుకకు చరణ్, తారక్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్న వార్తకు మరింత బలం చేకూరింది. అదే గనక జరుగుతే టాలీవుడ్ లోని సూపర్ స్టార్, మెగాస్టార్, నందమూరి అభిమానులకు పండగే…పండగ. 
 
 అయితే ఈ వార్తలపై యూనిట్ సభ్యులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. 

Related posts

వెంకటరాయ శాస్త్రి బహుభాషా కోవిదులు

admin

"కృష్ణార్జునయుద్ధం" మా వ్యూ

admin

ఆనంద్ దేవరకొండ తెరంగ్రేటం… ముహూర్తం ఖరారు చేసిన విజయ్ దేవరకొండ…

vimala t

Leave a Comment