telugu navyamedia
రాజకీయ వార్తలు

15 నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు.. పీకేతో అమరీందర్ సింగ్ చర్చలు!

prashnth kishore

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలను గెలిపించడానికి ఎన్నికల్లో వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పనిచేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో రాష్ట్రం ఎన్నికల్లో వ్యూహకర్తగా ఆయన పనిచేయనున్నారు.

మరో 15 నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ ఎన్నికలపై పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్ అప్పుడే దృష్టి పెట్టింది. ప్రశాంత్‌ కిశోర్‌ను ఎన్నికల సలహాదారుడిగా నియమించుకోవాలని ఆ పార్టీ పంజాబ్‌ నాయకత్వం ప్రయత్నాలు జరుపుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ ఇప్పటికే పీకేతో చర్చించినట్లు సమాచారం.

ఆయనతో ఒప్పందం కుదుర్చోవాలని అమరీందర్ సింగ్ నిర్ణయించారు. మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక, పథకాలు వంటి అంశాలపై అమరీందర్ ప్రణాళికలు వేసుకున్నారు. బీజేపీతో సుదీర్ఘకాలంపాటు మిత్రత్వాన్ని కొనసాగించిన అకాలీదళ్‌ ఆ పార్టీకి టాటా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుఖ్బీర్ ‌సింగ్‌ను తమవైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్‌ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts